పాట రచయిత:
Lyricist:
ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా ఈ గొప్పకార్యములు (2)
పాడకుండ ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా (2) ||ఊహించలేదయ్యా ||
1. తీసివేయబడినాను త్రోసివేయబడినాను
అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను (2)
అందరు వదిలేసినా –
నీవు నన్ను పట్టుకున్నావు
దుఃఖము ముంచేసినా –
నన్ను పైకి లేపావయ్యా (2) || పాడకుండ ||
2. ఉడిగిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను
ఆశలన్ని నీరుకారి వేసారిపోయాను (2)
ఆఖరి ఆక్షణములో –
నీవు నన్ను దర్శించినావు
ఊహించని నీ మేలుతో –
నన్ను తృప్తిపరచావయ్యా (2) || పాడకుండ ||
Oohinchaledayyaa ee melulanniyu
Thalanchaledayyaa ee goppa kaaryamulu (2)
Paadakunda undalenayyaa
Ninnu pogadakunda bratukalenayyaa (2) || Oohinchaledayyaa ||
1. Theesiveyabadinaanunu throsiveyabadinaanunu
Akasmaatthugaa guntalo nettiveyabadinaanunu (2)
Andaru vadilesinaa –
Neevu nannu pattukunnaavu
Dukhhamu munchesinaa –
Nannu paikilepaavayyaa (2) || Paadakunda ||
2. Udigipoyi unnaanu endipoyi unnaanu
Aashalanni neerukaari vesaaripoyaanu (2)
Aakhari aakshanamulo –
Neevu nannu darshinchinaavu
Oohinchani nee melutho –
Nannu truptiparachaavayyaa (2) || Paadakunda ||