పాట రచయిత: శాంత వర్ధన్ అందనం
Lyricist: Shantha Vardhan Andanam
శిల్పకారుడా – నా యేసయ్యా
మలచితివే నన్ను నీ రూపములో
శిలనైన నన్ను నీ పోలికలో
శిల్పకారుడా నా యేసయ్యా ఆ..ఆ..ఆ. ||శిల్ప||
నిషేధింపబడిన రాయినై
పారవేయబడినానయ్యా
శిల్పకారుడా నా యేసయ్యా
మూలకు తలరాయిగా నియమించినావు ||శిల్ప||
శిధిలమైన శిలవలె ఉంటిని
సిలువ రక్తముతో చిత్రించినావు
మూగబోయిన హృదయ వీణలో
మధుర గీతములు పలికించినావు ||శిల్ప||
ఏ రూపము లేని నన్ను నీవు
నీ రూపములో నిర్మించినావు
ఆత్మాభిషేకముతో అలంకరించి
పరిశుద్ధాత్మతో నడిపించుచున్నవు ||శిల్ప||
Shilpakarudaa – Naa Yesayya
Malachitive nannu nee roopamulo
Shilanaina nannu nee polikalo
Shilpakarudaa naa Yesayya aa..aa..aa. ||Shilpa||
Nishēdhimpabadi na raayinai
Paraveyabadinānaayyā
Shilpakarudaa naa Yesayya
Moolaku talaraayiga niyaminchaavuu ||Shilpa||
Shidilamainaa shilavale untinī
Siluva raktamuto chitrinchaavuu
Moogaboyina hridaya veenalo
Madhura geetamulu palikinchaavuu ||Shilpa||
Ye roopamu leni nannu neevu
Nee roopamulo nirminchinavuu
Aatmaabhishekamutō alankarinchi
Parishuddhātmatō nadipinchuchunnavuu
!!Shilpa!!