పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Christian Hymns
శ్రీ రక్షకుండు పుట్టఁగా
నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు
ఈ పాట పాడెను.
‘పరంబునందు స్వామికి
మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని
వ్యాపింపనీయుఁడు’. ||శ్రీ రక్షకుండు ||
ఆ రమ్యమైన గానము
ఈ వేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు
ఆ ధ్వని విందురు
ప్రయాసపడు ప్రజల
దుఃఖంబు తీరఁగా
ఆ శ్రావ్యమైన గానము
ఈ వేళ విందురు. ||శ్రీ రక్షకుండు ||
పూర్వంబు దూతగానము
భువిన్ వినంబడి
రెండువేల వర్షములు
గతించిపోయెను
భూప్రజలు విరోధులై
యుద్ధంబు లాడి యా
మనోజ్ఞమైన గానము
నలక్ష్యపెట్టిరి. ||శ్రీ రక్షకుండు ||
పాపాత్ములారా, వినుఁడి
శ్రీ యేసు ప్రభువు
మీ పాపభార మంతయు
వహింప వచ్చెను
తాపత్రయంబు నంతయుఁ
దానే వహించును
సంపూర్ణ శాంతి సంపద
లను గ్రహించును. ||శ్రీ రక్షకుండు ||
సద్భక్తులు స్తుతించిన
ఈ సత్యయుగము
ఈ వేళ నే నిజంబుగా
సమీప మాయెను
ఆ కాలమందు క్షేమము
వ్యాపించుచుండెను
ఆ దివ్య గాన మందఱు
పాడుచు నెప్పుడు. ||శ్రీ రక్షకుండు ||
Sri Rakshakundu Puttaga
Naakasha Sainyamu
Ihambuna Ketechuchu
Ee Paata Paadeenu.
‘Paramubundhu Swamiki
Maha Prabhavamu
Ihambundhu Shaantini
Vyaapimpaaneechaadu.’ || Sri Rakshakundu ||
Aa Ramyamaaina Gaanamu
Ee Vela Mrogunu
Santhushtulaaina Bhakthulu
Aa Dhvani Vinduru
Prayaaspaduga Prajala
Dukhambu Teeraga
Aa Shraavyamaaina Gaanamu
Ee Vela Vinduru. || Sri Rakshakundu ||
Poorvambu Doothagaanamu
Bhuvin Vinambadi
Renduvela Varshamulu
Gatinchipoyeenu
Bhooprajalu Viroodhulaayi
Yuddhambu Laadi Yaa
Manojgnamaaina Gaanamu
Nalakshyapetiri. || Sri Rakshakundu ||
Paapaatmulaaraa, VinuDi
Sri Yesu Prabhuvu
Mee Paapabhara Mantayu
Vahimpa Vachchenu
Taapatrayambu Nanthayu
Dhaane Vahinchunu
Sampoorna Shaanti Sampadha
Lanu Grahinchunu. || Sri Rakshakundu ||
Sadbhaktulu Stutinchina
Ee Satyayugamu
Ee Vela Ne Nijambuga
Sameepa Maayenu
Aa Kaalamandu Kshemmamu
Vyaapinchuchundenu
Aa Divya Gana Mandaru
Paaduchu Neppudu. || Sri Rakshakundu ||