పాట రచయిత:
Lyricist:
సర్వ కృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తొత్రముచేసి స్తుతించెదము
సంతసముగ నిను పొగడెదము
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను
ఆనందముతో సాగెదను
నే నానందముతో సాగెదను
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి || హల్లెలూయా ||
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృప నిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడచుటకు నను పిలచితివి || హల్లెలూయా ||
మరణ శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చీతివి || హల్లెలూయా ||
భువినుండి శ్రేష్ఠ ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండినను
ప్రేమించి క్రయధన మిచ్చితివి || హల్లెలూయా ||
ఎవరు పాడని గీతమును
యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను
యేసుకు నేనేమివ్వగలను || హల్లెలూయా ||
Sarva krupaa nidhi yagu prabhuvaa – sakala
chara chara santoshamaa – stotramu chesi
stutinchedamu – santasamuga ninu pogadedamu
Halleluya Halleluya Halleluyaa yani
paadedanu – aanandamutho saagedanu
Preminchi nannu vedakitivi – preetitho nannu
rakshinchitivi – parishuddamugaa jeevinchuta – kai –
paapini nanu karuninchitivi ||Halleluya||
Alpa kaala shrama lanubhavimpa – anudinamu
krupa nitchitivi – naadhuni adugujaadalalo
nadachutaku nannu pilichitivi ||Halleluya||
Marana shareeramu marpu nondi mahima
shareeramu pondutakai – mahi maatmatho nanu
nimpitivi – marana bhayamulanu theerchitivi ||Halleluya||
Bhuvinundi shresta phalamuganu – devuniki nitya
swaastyamu gaa bhoo janamulalo nundinanu
preminchi kraya dhana mitchitivi ||Halleluya||
Evaru paadani geetamunu yesuni goorchi paadutakai
hethuvu lekaye preminchenu yesuku
nenemivva galanu ||Halleluya||