పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Seeyonu Geethalu
స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
స్తోత్ర గీతములను పాడుచు – ప్రియ ప్రభుని పూజించుడి
రారండి సంతసించుచు – రారాజును కీర్తించను
రాజులకు రాజని – ప్రభువులకు ప్రభువని
రమ్యమైన రాజును స్తుతించెదం || స్తోత్ర ||
సిలువలో బలియాయెను – విలువైన రక్తము కార్చెను
ఎంత శ్రమనొందెను – ఎంత బాధ నోర్చెను
తన రక్తముతో మనల కొనెగదా || స్తోత్ర ||
విందు శాలకు తెచ్చెను – ప్రేమ ధ్వజము పైకెత్తెను
వింత సుందరుడని – వేలలో శ్రేష్ఠుడని
ఎంతైన జేయు సామర్థ్యుడని || స్తోత్ర ||
మన ఆత్మ ప్రాణ – దేహముల్ – సజీవముగ నర్పింతుము
అత్తరును పూసిన – మరియ వలె మనమును
పరిమళంబులన్ వ్యాపింప జేయుదం || స్తోత్ర ||
ప్రశంసించె ప్రభువు మరియను – మంచి కార్యము చేసెనని
ప్రభువు కొరకు చేయుము – ప్రాణము నర్పించుము
ప్రభువే సర్వము మనకు || స్తోత్ర ||
మరణమున్ తానే గెల్చెను – సైతానును ఓడించెను
మరణమున్ మ్రింగెను – మరణముల్లు విరిచెను
జయము జయమటంచు ఆర్భటించెదం || స్తోత్ర ||
ఆర్భాటముగా ప్రభువు – మేఘారూఢుడై వచ్చును
నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే
మహిమ దేహములను పొంది యుందుము || స్తోత్ర ||.
Stotra geetamulanu paaduchu –
Priya prabhuni poojinchudi Halleluya Halleluya
Halleluya Halleluya Halleluya Halleluya
stotra geetamulanu paaduchu
priya prabhuni poojinchudi
Raarandi santasinchuchu raaraajunu
keertinchanu – raajulaku raajani
prabhuvulaku prabhuvani ramyamaina
raajunu stutinchedam ||Stotra||
Siluvalo bali yaayenu viluvaina rakhtamu
kaarchenu – entha shrama nondenu entha
baadha norchenu thana rakhtamutho
manala kone gadaa ||Stotra||
Vindu shaalaku thechchenu – prema
dwajamu pai keththenu vintha
sundarudani – velalo shrestudani
enthaina jeyu saamardhyuni ||Stotra||
Mana aatma praana dehamul sajeevamuga
narpintumu – aththarunu poosina
mariya vale manamunu parimalambulan
vyaapimpa jeyudam ||Stotra||
Prasham shinche prabhuvu mariyanu
manchi kaaryamu chesenani prabhuvu
koraku cheyumu – praanamu narpinchumu
prabhuve sarvamu manaku ||Stotra||
Maranamun thaane gelchenu – saatanunu
odinchenu maranamun mringenu
marana mullu virichenu jayamu jayamanchu
aarbhatinchedamu ||Stotra||
Aarbhaatamugaa prabhuvu megha –
roodu dai vachchunu nishchayamugaa
manalanu konipovu vegame mahima dehamulanu
pondi yundumu ||Stotra||