పాట రచయిత:
Lyricist:
నిన్ను విడువను యేసుప్రభు
నిన్ను విడువగ లేను
ఎన్నడును నిను బాసి
ఏమిచేయగజాల నా ప్రభువా ||నిన్ను||
నిను మరచి తిరుగుచు నేనుండిన
నీ సన్నిధి విడచి ఎటుబోయిన
నను మరువకను మరి విడువకను
వెనువెంట నుంటివి కాదా నా ప్రభువా! ||నిన్ను||
అనుదిన జీవితమును మదినెంచగా
అనుకొనని అపాయము లెన్నెన్నియో
నను సంధించగా నను బంధించగా
నన్నాదుకొంవి గాదా నా ప్రభువా! ||నిన్ను||
పలు సమయములందున నీ చిత్తమున్
పరిపూర్ణముగా నే నెరుంగక
మేలని తలచి కీడునె యడుగ
వలదంచు నిలిపితి వాహా నా ప్రభువా! ||నిన్ను||
నీ మేలుల నన్నిటి నే నెంచగా
నీ ప్రేమామృతమును చవి చూడగా
నా మది భక్తితో నా హృది ప్రేమతో
ఉప్పొంగి పొరలెను గాదా నా ప్రభువా! ||నిన్ను||
Ninnu viduvanu Yesuprabhu
Ninnu viduvagalenu
Ennadunu ninnu baasi
Emi cheyagajala na prabhuva ||Ninnu||
Ninnu marachi tiruguchu nēnuṇḍina
Nee sannidhi vidachi etu boyina
Nanu maruvakanu mari viduvakanu
Venuventā nuṇṭivi kāda na prabhuva! ||Ninnu||
Anudina jeevitamunu madinenchaga
Anukonani apāyamu lennenniyo
Nanu sandhinchaga nanu bandhichaga
Nannādikonuvi kada na prabhuva! ||Ninnu||
Palu samayamulaṇḍuna nee chittamun
Paripoornamuga ne nerungaka
Mēlani talachi kīdune yaduge
Valadanju nilipiti vāha na prabhuva! ||Ninnu||
Nee melula nanniti ne enchaga
Nee premamrutamunu chavi choodaga
Naa madi bhaktitho naa hrudi prematho
Uppongi poralenu kada na prabhuva! ||Ninnu||