పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును – 2
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
1. సర్వోన్నతమైన స్థలములయందు
నీ మహిమ వివరింపగా ఉన్నతమైన
నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే – 2
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం – 2
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి – 2
2. సద్గుణరాశి నీ జాడలను
నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన
పయనం నీ కృపకు సంకేతమే – 2
కృపవెంబడి కృపపొందగా
మారాను మధురముగా నే పొందగా – 2
నాలోన ఏ మంచి చూసావయ్యా
నీప్రేమ చూపితివి నా యేసయ్యా – 2
3. సారెపైనున్న పాత్రగ నన్ను
చేజారిపోనివ్వక శోధనలెన్నో
ఎదిరించినను నను సోలిపోనివ్వక – 2
ఉన్నావులె ప్రతిక్షణమునా
కలిసి ఉన్నావులె ప్రతి అడుగున – 2
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి – 2
Athi Parishudhuda Sthuthi Naivedhyamu
Neeke Arpinchi Keerthinthunu – 2
Neevu Naa Pakshamai Nanu Dheevinchagaa
Neevu Naa Thoduvain Nanu Nadipinchagaa
Jeevinthunu Nee Kosame
Aasrayamaina Naa Yesayyaa
Sarvonnatha Sthalamulayandhu
Nee Mahima Vivarimpagaa
Unnathamaina Nee
Sankalpamu Ennadu Aascharyame – 2
Mundhennadu Chavi Choodani
Sarikrothadhaina Premamrutham – 2
Neelone Dhachavu Eenatikai
Nee Runam Theeradhu Yenatiki – 2
Sadhgunarasi Nee Jadalanu
Naa Yedhuta Nunchukoni
Gadachina Kaalam Saagina
Payanam Nee Krupaku Sankethame – 2
Krupavembadi Krupa Pondhagaa
Maaranu Madhuramugaa Ne Pondhagaa – 2
Naalona Ye Manchi Choopavayyaa
Nee Prema Choopithivi Naa Yesayya – 2
3. Saarepainunna Paathraga
Nannu Chejariponivvaka
Sodhanalenno Yedhirinchinanu
Nanu Soliponivvaka – 2
Unnavule Prathikshanamunoo
Kalisunnavule Prathi Aduguna – 2
Neevega Yesayya Naa Oopiri
Neevegaa Yesayya Naa Kaapari – 2